భారతదేశం, నవంబర్ 8 -- ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు ప్రతివారం స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. ఇక తెలుగులో అన్ని రకాల జోనర్స్‌ను టచ్ చేస్తూ మేకర్స్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సినిమాలు, వెబ్ సిరీస్‌లు మాత్రమే కాకుండా డాక్యుమెంటరీ సినిమాలు సైతం తెలుగులో ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి.

తెలుగు వారి సంస్కృతి, పండుగలు, వైవిధ్యం, విశిష్టతను చాటి చెప్పేందుకు ఈ డాక్యుమెంటరీలను మేకర్స్ రూపొందిస్తున్నారు. అలా తాజాగా ఓటీటీలోకి ఓ తెలుగు డాక్యుమెంటరీ సినిమా వచ్చేసింది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకునే దసరా పండుగపైన ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.

అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతంలో దసరా ఉత్సవాలను కన్నుల పండుగగా జరుపుకుంటారు. అలా దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకునే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్...