భారతదేశం, డిసెంబర్ 18 -- ఓటీటీలోకి ఈ వారం తెలుగులో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో మూడు ఒకేరోజు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. అలాగే, అవన్నీ ఒక్కోటి ఒక్కో రకమైన జోనర్లలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మలయాళంలో తెరకెక్కి మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫార్మా. మెడికల్ కార్పోరేషన్‌లో జరిగే అవినీతి చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. డిసెంబర్ 19న అంటే రేపు జియో హాట్‌స్టార్‌లో ఫార్మా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో సైతం ఫార్మా ఓటీటీ రిలీజ్ కానుంది.

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్, సర్వైవల్, డార్క్ కామెడీ సిరీస్‌గా తెరకెక్కింది ఫాల్అవుట్. ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఫాల్అవుట్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ అయింద...