భారతదేశం, జనవరి 19 -- ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అలరించిన సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' (GoT). గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రపంచాన్ని మరింతగా విస్తరించి హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్స్ అనే మరో ఓటీటీ సిరీస్‌ను జీవోటీ అభిమానుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసింది.

ఇప్పుడు ఇదే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ నుంచి ప్రీక్వెల్‌గా మరో ఓటీటీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అదే 'ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్' (A Knight of the Seven Kingdoms). జార్జ్ ఆర్.ఆర్. మార్టిన్ రాసిన 'టేల్స్ ఆఫ్ డంక్ అండ్ ఎగ్' నవలల ఆధారంగా ఈ సరికొత్త ప్రీక్వెల్ ఓటీటీ సిరీస్ తెరకెక్కింది.

మనం 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లో చూసిన సంఘటనలకు సుమారు వంద ఏళ్ల (100 ఏళ్ల చరిత్రతో) ముందు, అలాగే 'హౌజ్ ఆఫ్ ది డ్రాగన్' తర్వాత జరిగిన కథ ఇది. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు ప్రీక్వెల్‌తోపాటు హౌజ్ ...