భారతదేశం, నవంబర్ 2 -- ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ప్రతివారం ఎన్నో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగులోనూ అధికంగా ఓటీటీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే, ఇటీవల కాలంలో స్వచ్ఛమైన తెలుగు సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతివారం సరికొత్తగా ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో ఓటీటీ తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది.

ఈ క్రమంలోనే ఇవాళ ఆదివారం (నవంబర్ 2) ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా సింధు భైరవి. తెలుగులో మ్యూజికల్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీగా సింధు భైరవి తెరకెక్కింది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణ వహించారు.

అలాగే, సింధు భైరవి సినిమాకు సాయి తేజ దర్శకత్వం వహించారు. శేఖర్ గంగమోని సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.. సాయి మధుకర్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో కృష్ణ చైతన్య కారంచేడు, మృదుల అయ్యంగార్...