Telangana,hyderabad, ఆగస్టు 16 -- అపోహలు, అనుమానాలతో ముందుకు వెళితే అభివృద్ధి సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, ఓపిక, సహనం తనకున్నాయన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

క్రెడాయ్ హైదరాబాద్ఆ ధ్వర్యంలో హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కొందరు కావాలని సృష్టించే అపోహలు, అనుమానాలకు మరింత ఊతమిస్తే అంతిమంగా వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుంద్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో సరైన ప్రణాళికలతో ముందుకొస్తే తప్పకుండా సహకరిస్తామని స్పష్టం చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....