భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో ముందంజలో నిలిచేందుకు బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తున్న దిగ్గజ టెక్ సంస్థ 'ఒరాకిల్' (Oracle) మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని తన సిబ్బందిపై వేటు వేస్తూ లేఆఫ్స్ రౌండ్‌ను ప్రారంభించింది. అయితే, ఈ ప్రక్రియలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇస్తున్న 'సివరెన్స్ ప్యాకేజీ' ఇతర ప్రధాన టెక్ కంపెనీలతో పోలిస్తే అత్యంత తక్కువగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోయిన అమెరికా సిబ్బందికి ఒరాకిల్ 4 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, వారు పనిచేసిన ప్రతి ఏడాదికి ఒక వారం వేతనాన్ని అదనంగా చెల్లిస్తోంది. కంపెనీ ప్రామాణిక నిబంధనల ప్రకారం గరిష్టంగా 26 వారాల వేతనాన్ని మాత్రమే పరిహారంగా పొందే వెసులుబాటు ఉంది. కొత్తగా చేరిన వారైనా, ఏళ్లుగా...