భారతదేశం, డిసెంబర్ 21 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం 'ఒప్పో'.. తన రెనో సిరీస్‌లో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది! వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఒక శక్తివంతమైన 'కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్' స్మార్ట్​ఫోన్‌ను తీసుకురావాలని ఒప్పో ప్లాన్ చేస్తోంది. దీనికి 'ఒప్పో రెనో 15 ప్రో మినీ' అని పేరు పెట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లు, ఇండియా లాంచ్ వివరాలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

ప్రముఖ టిప్‌స్టర్ 'Gadgetsdata' సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్​ఫోన్ ఇండియా లాంచ్ చాలా దగ్గర్లోనే ఉంది! డిసెంబర్ 2025 చివరి వారంలో లేదా జనవరి 2026 ప్రారంభంలో ఈ గ్యాడ్జెట్​ని ఒప్పో సంస్థ అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉంది.

దీని మోడల్ నంబర్ CPH2813 అని కూడా లీకులు చెబుతున్నాయి.

చిన్న సైజులో ఉన్నప్పటికీ, ఫీచర్ల ...