భారతదేశం, ఆగస్టు 17 -- ఉరుకులు, పరుగుల జీవితం, పని ఒత్తిడి, శారీరక, మానసిక సమస్యలు.. ఈ ఆధునిక జీవనశైలి మహిళల నెలసరి (పీరియడ్స్) ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతులేని ఒత్తిడి వల్ల మహిళలల్లో నెలసరి సక్రమంగా రాకపోవడం, అసౌకర్యం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.

నెలసరి అనేది సహజంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ, ఇటీవలి కాలంలో చాలామంది మహిళలు ఒత్తిడి కారణంగా నెలసరిలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలం పనిచేయడం, డిజిటల్ ప్రపంచంలో మునిగిపోవడం, శరీరాకృతి గురించి ఆందోళన చెందడం, వ్యక్తిగత విషయాలను బ్యాలెన్స్ చేయలేకపోవడం వంటివి ఒత్తిడిని పెంచుతున్నాయి.

మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున, ఒత్తిడి అనేది నెలసరిపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్లో ఆబ్‌స్టెట్రిక్స్ అండ్...