Telangana,hyderabad, అక్టోబర్ 1 -- తెలంగాణలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. రాచకొండ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో. కోట్ల రూపాయలు విలువ చేసి గంజాయిని సీజ్ చేశారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల రాకెట్ ను చేధించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్ కు ఈ గంజాయిని తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు బృందాలు అబ్దుల్లాపూర్మెట్ లోని కొత్తగూడం ఎక్స్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారి 65 వద్ద తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఒక ట్రక్కును అడ్డగించి వాహనం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

రూ.6.25 కోట్ల విలువైన 1,210 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు త...