భారతదేశం, డిసెంబర్ 25 -- ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో పాటు మరో ఐదుగురు సభ్యులు మృతి చెందారు.

సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న గణేశ్ ఉయికే. కీలక నేతగా ఉన్నారు. ఆయన తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలానికి చెందిన వ్యక్తి. ఆయనపై రూ .1.1 కోట్ల రివార్డు ఉంది. ఒడిశాలో కేంద్రంగా కీలకమైన కార్యకలాపాలకు నాయకత్వం నేతగా గణేశ్ ఉయికేకు పేరుందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మ అడవిలో బుధవారం రాత్రి భద్రతా బలగాలతో కాల్పులు జరిగాయి. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అయితే గురువారం ఉదయం చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో తాజాగా కాల్పులు జరిగాయి. ఇందులో ఉయికేతో సహా మరికొందరు మావోయి...