భారతదేశం, అక్టోబర్ 31 -- నేటి కాలంలో విలువ కోల్పోతున్న 'ఒక్క రూపాయి' కోసం ఓ సామాన్యుడు పెద్ద పోరాటమే చేశాడు! తనకు దక్కాల్సిన ఆ ఒక్క రూపాయి కోసం భారతీయ రైల్వేకి చెందిన ఐఆర్​సీటీసీని కోర్టు మెట్లు ఎక్కించాడు. టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు రావాల్సిన రీఫండ్ మొత్తంలో ఒక్క రూపాయి తక్కువ ఇచ్చారనే కారణంతో కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించి, రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని నిలదీశాడు.

కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాకు చెందిన ఆ ప్రయాణికుడు ఐఆర్‌సీటీసీ సేవల్లోని లోపాలను సవాలు కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం కాసర్‌గోడ్ జిల్లా కన్జ్యూమర్ కమిషన్ బాధితుడికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

సదరు ప్రయాణికుడు 2024 ఆగస్టు 11న త్రీ-టైర్ ఏసీ కోచ్‌లో రూ. 553 చెల్లించి రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆగస్టు 20న ప్రయాణం చేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రయా...