భారతదేశం, జూన్ 26 -- Prithviraj Sukumaran On 100 Takes For Single Shot Varanasi: భారతీయ చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి పర్‌ఫెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా రావాలనే ఆయన తపన ఒక్కోసారి నటీనటులకు అగ్నిపరీక్షగా మారుతుంటుంది.

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాల సమయంలోనే ఈ విషయం రుజువైంది. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో రాజమౌళి తెరకెక్కిస్తున్న సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ మ్యాగ్నమ్ ఓపస్ 'వారణాసి' (Varanasi) సెట్స్‌పై కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలకమైన విలన్ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్.. షూటింగ్ స్పాట్‌లో రాజమౌళి పట్టుదల ఏ స్థాయిలో ఉంటుందో వివరిస్తూ ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు...