భారతదేశం, డిసెంబర్ 30 -- హాలీవుడ్‌లో ఒకప్పుడు మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ అంటేనే అదో పెద్ద సంచలనం. కేవలం అగ్ర నటులు మాత్రమే ఆ స్థాయి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది.. బెంచ్‌మార్క్ కాస్తా 100 మిలియన్ డాలర్లకు చేరింది.

ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు, గ్లోబల్ ఫ్రాంచైజీలను భుజాన మోసే స్టార్లు ఇప్పుడు వందల కోట్లలో పారితోషికం అందుకుంటున్నారు. ఈ రేసులో 2025 సంవత్సరానికి గానూ 63 ఏళ్ల వయసులోనూ ఒక నటుడు 'బాక్సాఫీస్ కింగ్' అనిపించుకుంటూ ఏకంగా 150 మిలియన్లు డాలర్స్ (సుమారు రూ. 1250 కోట్లు) తన ఖాతాలో వేసుకున్నారు.

ఆయనే మరెవరో కాదు హాలీవుడ్ యాక్షన్ లెజెండ్ టామ్ క్రూజ్. గత తొమ్మిదేళ్లలో ఐదుసార్లు అగ్రస్థానంలో నిలిచిన డ్వేన్ జాన్సన్‌ను వెనక్కి నెట్టి పదేళ్ల తర్వాత టామ్ క్రూజ్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ ఏడ...