భారతదేశం, ఫిబ్రవరి 8 -- 2000వ దశకం ఆరంభంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న డ్యాన్సర్‌గా, ఐటమ్ సాంగ్స్ హీరోయిన్‌గా ముమైత్ ఖాన్ ఒక వెలుగు వెలిగారు. హిందీలో 'మున్నాభాయ్ ఎంబీబీఎస్'లోని 'దేఖ్ లే' పాటతో మొదలైన ఆమె ప్రయాణం.. తెలుగులో మహేశ్ బాబు 'పోకిరి'లో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' వరకు అప్రతిహతంగా సాగింది.

అయితే, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ముమైత్ ఖాన్ హఠాత్తుగా తెరమరుగయ్యారు. చాలామంది ఆమెకు అవకాశాలు తగ్గడం వల్లే వెళ్లిపోయిందని భావించారు. కానీ, అసలు కారణం తెలిస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే.

తాజాగా 'ఐ డ్రీమ్ మీడియా' (iDream Media)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముమైత్ తన జీవితాన్ని మార్చేసిన ఆ చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు. 2016లో తనకు ఒక ఘోర ప్రమాదం జరిగిందని, దానివల్ల మెదడులోని ఐదు నరాలు చిట్లిపోయాయని ముమైత్ ఖాన్ వెల...