భారతదేశం, జూలై 2 -- గురుగ్రామ్‌కు చెందిన రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 'రివోల్ట్ ఆర్‌వీఎక్స్' (Revolt RVX) ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త బైక్ ప్రారంభ ధరను రూ. 1.29 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించగా, ప్రభుత్వ సబ్సిడీల తర్వాత దీనిని రూ. 1.24 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.

దేశ రాజధాని ఢిల్లీలో ఈ బైక్ ధర మరింత తక్కువగా ఉండనుంది. అక్కడ అమలులో ఉన్న ఈవీ పాలసీ సబ్సిడీ వర్తిస్తే కేవలం రూ. 95,000లకే (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. ఒకవేళ వినియోగదారులు తమ పాత పెట్రోల్ బైక్‌ను స్క్రాప్ (రద్దు) చేసి ఈ సరికొత్త ఈవీని కొనుగోలు చేస్తే, కేవలం రూ. 85,000లకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభం కాగా, జూలై చివరి వారం నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

రివోల్ట్ మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో ఇప...