భారతదేశం, ఆగస్టు 16 -- ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో స్పోర్ట్‌ను ఆగస్టు 15 సాయంత్రం తమిళనాడులోని ప్లాంట్‌లో సంకల్ప్ కార్యక్రమంలో లాంచ్ చేసింది. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.1,49,999గా నిర్ణయించింది. 999 చెల్లించి బుకింగ్స్ ప్రారంభించవచ్చు. కంపెనీ తన డెలివరీని 2026 జనవరిలో ప్రారంభిస్తుంది.

ఎస్ 1 లైనప్‌లో స్పోర్ట్-ఫోకస్డ్ వేరియంట్‌గా లభిస్తుంది. ఇందులో 13 కిలోవాట్ల ఫెర్రైట్ మోటారును కంపెనీ అభివృద్ధి చేసి తయారు చేసింది. కొత్త స్టైలింగ్, స్పోర్ట్ ట్యూన్డ్ సస్పెన్షన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ఏడీఏఎస్) ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలు. భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈ టెక్నాలజీని ఉపయోగించడం ఇదే తొలిసారి.

ఎస్ 1 ప్రో స్పోర్ట్ డిజైన్, ఫీచర్లలో ఏరోడైనమిక్ ఆప్టిమైజ్డ్ బాడీవర్క్, చిన్న ...