భారతదేశం, మార్చి 31 -- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఈ వాహనసేవ భక్తి భావంతో వైభవంగా జరిగింది. భజన బృందాల హారతులు, కోలాటాల మధ్య స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
'మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో ఎంతో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి అమృతం లభించినప్పుడు దానిని పంచుకునే విషయంలో కలహం చెలరేగుతుంది. ఆ కలహాన్ని నివారించి అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీహరి మోహిని రూపంలో అవతరించారు. తన భక్తులు కానివారు మాయకు లోనవుతారని, భక్తులు మాత్రం ఆ మాయన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.