భారతదేశం, జూన్ 9 -- కొంతమంది ఒంటరిగా ఉండటమే సురక్షితం అని భావిస్తుంటారు. కానీ నిజానికి జీవిత ప్రయాణాన్ని ఒంటరిగా సాగించడం అంత సులువు కాదు. కొన్ని పనులను ఒంటరిగా చేయడానికి ప్రయత్నిస్తే మనకు మనమే నష్టం చేసుకునే ప్రమాదం ఉంది. జీవితంలో నిజమైన బలం ఒంటరితనంలో లేదు, మంచి వ్యక్తుల తోడులో, సరైన అవగాహనలో దాగి ఉందని పెద్దలు చెబుతుంటారు. అందుకే మనకు అండగా ఉండే మన కుటుంబం, స్నేహితులతో కలిసి కొన్ని పనులు చేయడం ఎంతో అవసరం. నిజమైన తోడే మనకు కొండంత బలం.

మహాభారత కాలంలో గొప్ప నీతిశాస్త్ర కోవిదుడిగా పేరుగాంచిన మహాత్మా విదురుడు.. ధృతరాష్ట్రుడికి అనేక హితబోధలు చేశారు. ఆయన చెప్పిన విషయాలు నేటి ఆధునిక కాలంలో కూడా మనిషి జీవితాన్ని ప్రశాంతంగా, సుఖంగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. విదుర నీతి ప్రకారం కొన్ని పనులను మనిషి ఒంటరిగా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా బల...