భారతదేశం, సెప్టెంబర్ 19 -- భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొత్త మోడల్‌ను కొన్ని రోజులు పరీక్షించిన తర్వాత, ఆపిల్ సంస్థ ఈసారి పనితీరు, డిజైన్, ఇంకా ఆచరణాత్మకతను సమపాళ్లలో అందించే ఒక పరికరాన్ని తీసుకొచ్చిందని స్పష్టమైంది. ప్రో వెర్షన్లు సహజంగానే టెక్ ప్రియులను ఆకట్టుకున్నప్పటికీ, స్టాండర్డ్ ఐఫోన్ 17 అదే ప్రధాన ఫీచర్లను తేలికైన, మరింత అందుబాటు ధరలో తీసుకొచ్చింది. మా రివ్యూలో దీనికి 5కి 4.5 రేటింగ్ ఇస్తున్నాం.

ఇదివరకు చూసినట్టే అనిపించినా ఏం ఫీల్ ఉంది మావా అనేలా ఉంటుంది

భారతదేశంలో ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ. 82,900. ఈ ధర 256GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. 512GB ఆప్షన్ ధర రూ. 1,02,900. పెరుగుతున్న స్టోరేజ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆపిల్ ఈసారి ప్రారంభ మోడల్‌నే 256GB స్టోరేజ్‌తో తీసుకొచ్చింది. కొత్త పాస్టెల...