భారతదేశం, ఏప్రిల్ 29 -- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి కళ్లు ఇప్పుడు మే 4న జరగబోయే కౌంటింగ్‌పైనే ఉన్నాయి. అయితే, అంతకంటే ముందే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయ వేడిని పెంచేశాయి. ఈ అంచనాల ప్రకారం ఎక్కడ ఏ పార్టీ జెండా ఎగురవేయబోతోందో ఒకసారి లుక్కేద్దాం.

అసోంలో బీజేపీ 'సునామీ' సృష్టించబోతోందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగుతోంది. కాంగ్రెస్ కూటమి కేవలం 24-36 సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది.

తమిళనాడులో మరోసారి డీఎంకే స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోనుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు విజయ్ పార్టీ (TVK) 18-24 సీట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేయడం విశేషం.

బెంగాల్ కో...