భారతదేశం, డిసెంబర్ 26 -- ఉదయ్‌పూర్‌లో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మహిళల భద్రత విషయంలో 5 కి 4.7 రేటింగ్ ఇచ్చుకున్న ఒక ప్రైవేట్ ఐటీ సంస్థలో, సాక్షాత్తూ సీఈఓ (CEO) నే ఈ దారుణానికి ప్రధాన కారకుడు కావడం గమనార్హం.

డిసెంబర్ 20 (శనివారం) రాత్రి శోభాగ్‌పురా ప్రాంతంలోని ఒక హోటల్‌లో సదరు ఐటీ సంస్థ సీఈఓ పుట్టినరోజు, ఇయర్-ఎండ్ పార్టీ జరిగింది. ఈ వేడుకకు బాధితురాలైన మహిళా మేనేజర్ కూడా హాజరయ్యారు. పార్టీ ముగిశాక అందరూ వెళ్లిపోయిన తర్వాత, నిందితురాలైన ఇంకో మహిళా ఉద్యోగి.. బాధితురాలిని ఇంటి దగ్గర దింపుతానని నమ్మబలికింది.

కారులో కుట్ర: మహిళా ఉద్యోగి మాటలు నమ్మి బాధితురాలు కారు ఎక్కగా, అప్పటికే అందులో సీఈఓ, మహిళా ఉద్యోగి భర్త ఉన్నారు.

మత్తు పదార్థం: దారిలో నిందితులు బాధితురాలికి మద్యం లేదా మత్తు కలిగించే సిగరెట్లను బలవంతంగా ఇచ్చ...