భారతదేశం, ఆగస్టు 27 -- ఏటా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను దాఖలు చేస్తారు. కానీ రిటర్న్ దాఖలు చేసిన తర్వాతే రిలాక్స్ అయిపోతారు. హమ్మయ్యా పెద్ద పని అయిపోయింది అనుకుంటారు. కానీ రీఫండ్ కోసం చేయాల్సిన మరో పని ఉంది. బ్యాంక్ ఖాతా కన్ఫామ్ చేయాలి. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లింక్ చేసిన, విజయవంతంగా ధృవీకరించిన ఖాతాకు మాత్రమే వాపసును పంపుతుంది. దీని అర్థం ఖాతా ధృవీకరించకపోతే మీ వాపసు నిలిచిపోవచ్చు లేదా ప్రక్రియ ఆలస్యం కావచ్చు. అందుకే ఓసారి చెక్ చేసుకోవడం మంచిది.

ఈ ప్రక్రియ చేయడం చాలా సులభం, ప్రతి పన్ను చెల్లింపుదారుడు కొన్ని నిమిషాల్లోనే దీన్ని పూర్తి చేస్తాడు. మీ పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతాలో నమోదైన పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ ఒకదానికొకటి సరిపోలుతున్నాయని చూసుకోండి. ఈ మ్యాచ్ మీ రీఫండ్ భద్రత, సకా...