భారతదేశం, ఆగస్టు 1 -- ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు సరికొత్త రికార్డు సృష్టించారు. జులై 31 అర్ధరాత్రి వరకు 5.9 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులకు శాఖ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

"ధన్యవాదాలు పన్ను చెల్లింపుదారులారా! అసెస్మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి జులై 31 నాటికి 5.9 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. మీ నమ్మకం, సకాలంలో చూపిన క్రమశిక్షణ భారత ఆర్థిక వృద్ధికి ఇంధనంగా నిలుస్తున్నాయి," అని ఆదాయపు పన్ను శాఖ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.

గడువు పొడిగింపునకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతేడాది కొన్ని సాంకేతిక, ఇతర కారణాల వల్ల గడువును పొడిగించినప్పటికీ, ఈసారి ఆ పరిస్థితి లేదని నిపుణులు విశ్...