భారతదేశం, సెప్టెంబర్ 11 -- దేశ రాజధాని కేంద్రంగా సేవలు అందిస్తున్న ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) షేరు గడిచిన కొద్ది నెలలుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, గ్యాస్ కొనుగోలు వ్యయం పెరగడం, రూపాయి క్షీణత వంటి అంశాలు కంపెనీ లాభదాయకతపై ప్రభావం చూపాయి. ఫలితంగా 2026లో ఇప్పటివరకు ఈ షేరు దాదాపు 20.68 శాతం మేర క్షీణించింది.

అయితే, ఈ తాజా పతనం వల్ల ఐజీఎల్ షేరు వాల్యుయేషన్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా మారిందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'మోతీలాల్ ఓస్వాల్' తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ షేరు పుంజుకునే అవకాశం ఉందంటూ 'బై' (BUY) రేటింగ్‌ను పునరుద్ఘాటించింది.

గత నాలుగు నెలల్లోనే ఐజీఎల్ షేరు సుమారు 10 శాతం మేర కరెక్ట్ అయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ధరలు రూపాయి...