భారతదేశం, ఆగస్టు 12 -- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) టీచింగ్ లెర్నింగ్ సెంటర్, దేశవ్యాప్తంగా ఉన్న కళాశాల అధ్యాపకుల కోసం భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, బయోటెక్నాలజీపై శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ STEM శిక్షణా కార్యక్రమం తొమ్మిది రోజుల రెసిడెన్షియల్ కోర్సు, ప్రతి బ్యాచ్‌కు 50 మంది అభ్యర్థులతో ఉచితంగా అందిస్తున్నట్టుగా ఐఐటీ మద్రాస్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (MMTTP) కింద నిర్వహించే ఈ శిక్షణను అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్స్ కోర్సులను బోధించే అధ్యాపకులకు ఉచితంగా అందిస్తున్నారు.

ఈ కార్యక్రమం గురించి ఐఐటీ మద్రాస్‌లోని టీచింగ్ లెర్నింగ్ సెంటర్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎడమన ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ కార్యక్రమం బోధనా ప్రభావాన్ని పెంచడానికి, విద్య...