భారతదేశం, అక్టోబర్ 3 -- లక్షలాది మంది యువత కలలుగనే ఐఐటీ సీటు సాధించినా.. తనలోని ఆలోచనలకు, ఆశయాలకు ఆ క్యాంపస్ సరిపోదని అతను భావించాడు. ధైర్యం చేసి చదువును పక్కనపెట్టి, సొంతంగా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. కేవలం 19 ఏళ్ల వయస్సులోనే అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో జెండా పాతి, ఏఐ ప్రపంచం చూపు తనవైపు తిప్పుకునేలా చేశాడు. అతడే భారతీయ యువ పారిశ్రామికవేత్త ద్రవ్య షా!

ఐఐటీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న రోజుల్లోనే ద్రవ్య షాకు కోడింగ్, ఏఐ సాంకేతికతపై ఆసక్తి పెరిగింది. ప్రవేశ పరీక్ష శిక్షణ పొందుతూనే సరదాగా ఒక చిన్న ఏఐ ప్రాజెక్ట్‌‌ను ప్రారంభించాడు. ఆ సైడ్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన ఆదాయమే అతను అమెరికాకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక వెసులుబాటును కల్పించింది.

సాంకేతికత, వ్యాపార రంగాల్లో అసాధారణ నైపుణ్యం ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇచ్చే ప్రతిష్టాత్మక 'ఓ-1 వీసా' న...