భారతదేశం, అక్టోబర్ 8 -- దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం(IIM Visakhapatnam) కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఐఎం విశాఖపట్నంలోని ఇంటర్ డిసిప్లినరీ డిసిషన్ సైన్సెస్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్(IDeAL - సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో ఈ నియామకాలు చేపడుతున్నారు.

రీసెర్చ్ అసోసియేట్ - డేటా సైన్స్ ఒక పోస్టు ఖాళీ ఉంది. నెలకు రూ.40,000 వేతనం అందజేస్తారు. ఇతర భత్యాలు వర్తించవు. అత్యుత్తమ ప్రతిభ కలిగిన అభ్యర్థులకు అధిక వేతనాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు. ఐఐఎం నిబంధనల ప్రకారం అభ్యర్థికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఒక సంవత్సరం కాలపరిమితితో కూడిన ఫిక్స్‌డ్ కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేస్తారు. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాల ఆధారంగా దీనిని ...