Telangana,andhrapradesh, ఆగస్టు 7 -- గత కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉండనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

రాయలసీమ,పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో 2 రోజులు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గురువారం(ఆగస్ట్ 07) అనంతపురం,సత్యసాయి,కడప,అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు-భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్ర,కాకినాడ,కోనసీమ,ఏలూరు, ఎన్టీఆర్,గుంటూరు, పల్నాడు,ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల,చిత్తూరు, తిరుపతి జిల్లాల...