భారతదేశం, ఆగస్టు 17 -- తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదారు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

ఇక ఆదిలాబాద్, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిర్మల్,నిజామాబాద...