Andhrapradesh, సెప్టెంబర్ 24 -- ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. అంతేకాకుండా. ఉపరితల ఆవర్తనం నుంచి మరొక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం.. గురువారం(సెప్టెంబర్25)నాటికి తూర్పుమధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం(సెప్టెంబర్ 26) దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల్లో వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే సూచనలున్నాయి. ఇది శనివారం(సెప్టెంబర్ 27) దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది.

వీటి ప్రభావంతో ఏపీలో ఆదివారం వరకు అక్కడక్కడ పిడుగులతో కూ...