Andhrapradesh,amaravti, అక్టోబర్ 1 -- పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ (అక్టోబర్ 1) బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇది పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఆతరువాత పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి దక్షిణఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వివరించింది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏపీలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం... ఇవాళ (01-10-25) శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ ...