భారతదేశం, ఏప్రిల్ 9 -- ఖగోళంలో గ్రహాల గమనం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహాలు రాశి పరివర్తనం చెందిన ప్రతిసారీ ద్వాదశ రాశుల జాతకాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. తాజాగా, జ్యోతిష్య శాస్త్రంలో ప్రేమ, ఐశ్వర్యం, ఆకర్షణకు ప్రతిరూపంగా భావించే శుక్రుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న శుక్రుడు, త్వరలోనే తన సొంత రాశి అయిన వృషభంలోకి అడుగు పెట్టనున్నాడు.

హిందూ పంచాంగం ప్రకారం, ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం 03:51 గంటలకు శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభ రాశికి శుక్రుడే అధిపతి కావడం విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు తన సొంత రాశిలో ఉన్నప్పుడు 'మాళవ్య రాజయోగం' ఏర్పడుతుంది. పంచమహాపురుష యోగాలలో ఒకటిగా పిలిచే ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి.

సొంత రాశిలోకి శ...