Telangana,andhrapradesh, ఆగస్టు 10 -- దక్షిణకోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.దీనికితోడు బుధవారం(13 ఆగస్టు) నాటికి వాయువ్య,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. అయితే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్ని ప్ర...