భారతదేశం, జనవరి 3 -- ఏపీ - తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాలపై కేంద్రం దృష్టి సారించింది. ఆయా అంశాలను చర్చించి పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర జల సంఘం ఛైర్మన్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటైంది. మరో 12 మంది సభ్యులను నియమించారు. ఏపీ, తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వం తరపున పలువురు ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు కూడా సభ్యులుగా అవకాశం కల్పించారు.
ఢిల్లీ వేదికగా 2025 జులై 16న జరిగిన ముఖ్యమంత్రుల(ఏపీ - తెలంగాణ) స్థాయి మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర జలశక్తిశాఖ పేర్కొంది. తెలంగాణ, ఏపీ నుంచి పలువురు అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించింది.
కమిటీ స్వరూపం చూస్తే. ఛ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.