Telangana,andhrapradesh, ఆగస్టు 8 -- తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే మరో రెండు రోజులు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ రాష్ట్రంలోని నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. పలు చోట్ల ఉరుములు, మెరుపుతో కూడిన వానలు పడుతాయి. 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

రేపు(ఆగస్ట్ 09) నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ...