భారతదేశం, సెప్టెంబర్ 29 -- ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా జరుగుతున్న ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. ఎన్నికలు మరో రెండు నెలలు ఆలస్యం కానున్నాయని, కోర్టు కేసుల క్లియరెన్స్ వస్తేనే ప్రక్రియ మొదలవుతుందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణపై నెట్టింట రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితా (ఎలక్టోరల్ రోల్స్), రిజర్వేషన్లకు సంబంధించి కోర్టులలో నడుస్తున్న కేసుల విచారణ పూర్తయ్యాకే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, అందుకే కనీసం మరో రెండు నెలల సమయం పడుతుందని కొందరు తప్పుడు ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారం ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ పరిస్థితిపై తక్షణమే...