Andhrapraesh, సెప్టెంబర్ 18 -- ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసును సిట్ విచారిస్తుండగా. మరోవైపు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోని కనీసం 20 ప్రదేశాలలో ఈ సోదాలు చేపట్టింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు, వ్యక్తులు, నిందితులతో సంబంధం ఉన్న వాళ్ల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరిగాయి. కొంతమంది నిందితులకు సంబంధించిన ప్రాంగణాల్లో కూడా సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.

అరెటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీ జ్యువెలర్స్ ఎగ్జింప్, ఎన్ఆర్ ఉద్యోగ్ ఎల్ఎల్పీ; ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై), వెంకటేశ్వర ప్యాకేజింగ్, సువర్ణ దుర్...