Andhrapradesh, సెప్టెంబర్ 19 -- ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ, రేపు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరగా. 2 రోజులు అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్ రెడ్డి ఈ కేసులో ఏ4గా ఉన్నారు. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు జులై 19న అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇటీవలే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ రాగా. తిరిగి సరెండర్ అయ్యారు. మిథున్‌రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

ఇవాళ, రేపు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ...