Andhrapradesh, అక్టోబర్ 4 -- ఖరీఫ్ 2025 కోసం ఈ-క్రాప్ డిజిటల్ సర్వే కింద భూమి, పంటల రిజిస్ట్రేషన్ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ చివరి వరకు పొడిగించింది. క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందలు కారణంగా.. ఈ గడువును పొడిగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ దిల్లీరావు తెలిపారు.

ఈ సీజన్లో ఈ-క్రాప్ డిజిటల్ సర్వే కింద భూముల 100 శాతం కవరేజీని సాధించాలని ప్రభుత్వం నిశ్చయించుకుందని ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ కు చివరి తేదీని అక్టోబర్ 25 గా నిర్ణయించామని తెలిపారు. సోషల్ ఆడిట్, దిద్దుబాట్లు మరియు మార్పులు అక్టోబర్ 30 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తుది జాబితా అక్టోబర్ ౩1వ తేదీన ప్రదర్శించబడుతుందన్నారు.

కృష్ణా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో 50 శాతానికి పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇక వైఎస్సార్ కడప, చిత్తూరు, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి ...