భారతదేశం, ఏప్రిల్ 8 -- ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా... ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగియనుంది.

దరఖాస్తు చేసుకునే విద్యార్థి.. సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలల్లో టెన్త్ చదువుతున్న వాళ్లై ఉండాలి. పూర్తిగా టెన్త్ ఎగ్జామ్ లో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మెరిట్ ను ప్రామాణికంగా తీసుకొని ఎంపీసీ,బైపీసీ, సీఈసీతో పాటు ఇతర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.

మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పూర్తిగా మెరిట్ ఆధారంగానే సీటు కేటాయిస్తారు. మే 1వ తేదీన జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్యను ప...