Andhrapradesh, ఆగస్టు 25 -- ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ వాయిదా పడింది. మంగళవారం (ఆగస్ట్ 26) నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని విద్యాశాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ్టి నుంచే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దీన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి వెల్లడించింది.

కాల్‌ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడినట్లు తెలిసింది. కాల్‌ లెటర్లను ఇవాళ ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లో ఉంచనున్నారు. 1:1 విధానంలో కాల్‌లెటర్లు ఇవ్వనున్నారు. https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా వీటిని అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వ్యక్తిగత లాగిన్లలో ఇవాళ్టి నుంచి వీట...