Andhrapradesh, ఆగస్టు 11 -- ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ వివరాల ద్వారా స్కోర్ కార్డును చెక్ చేసుకోవచ్చు.

ఇటీవలనే ఏపీ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటి ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించిన డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేశారు.

ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా.. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌ 6 నుంచి జులై 2 వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90 శాతం మంది హాజరయ...