Andhrapradesh, ఆగస్టు 1 -- ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీలు వచ్చేశాయి. అన్ని సబ్జెకుల ఫైనల్ కీలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని సులభంగా పొందవచ్చు. ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో Final KEY ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ సబ్జెక్టుల వారీగా పేర్లు కనిపిస్తాయి. సబ్జెక్ట్ పక్కన డాక్యుమెంట్ అని ఉంటుంది. దాని పక్కన క్లిక్ చేస్తే. మీకు ఫైనల్ కీతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. కీలో వచ్చే మార్కులను బట్టి. అభ్యర్థులు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా.. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417...