భారతదేశం, జూలై 6 -- Visakhapatnam Bengaluru Special Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway) తీపి కబురు అందించింది. విశాఖపట్నం - ఎస్ఎంవీటీ బెంగళూరు (SMVT Bengaluru) స్టేషన్ల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు మరియు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఈ ప్రత్యేక రైళ్లు(ఇరువైపుల) విశాఖ దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామల్ కోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తాయి. ప్రస్తుతం నడుస్తున్న పాత వేళలు, స్టాపేజీలు, కోచ్ల అమరిక మెయింటెనెన్స్ పద్ధతుల ప్రకారమే యథావిధిగా కొనసాగుతాయని దక్షిణ కోస్తా రైల్వే స్పష్టం చేసింది. బెంగళూరు, వైజాగ్ మార్గాల్లో ప్రయాణించే వారు ఈ పొడిగ...