భారతదేశం, జూన్ 23 -- ఏపీలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే (విజయవాడ డివిజన్) శుభవార్తను అందించింది. నరసాపురం నుంచి నడుస్తున్న ప్రత్యేక రైళ్లను (Train on Demand - TOD) శాశ్వత రైళ్లుగా (రెగ్యులరైజ్) మారుస్తూ రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం 2026 జూలై మొదటి వారం నుంచి అమలులోకి రానుంది. ప్రయాణికుల రద్దీ, నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ ఈ అడుగు వేసింది.

తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై(అరుణాచలం) వెళ్లే భక్తుల కోసం ఈ రైలును రెగ్యులరైజ్ చేశారు. 2026 జూలై 1వ తేదీ నుంచి ఈ మార్పులు అందుబాటులోకి వస్తాయి.

ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చి...