భారతదేశం, అక్టోబర్ 3 -- Vijayawada Palasa Special Trains : వారాంతాల్లో రైళ్లలో పెరిగే ప్రయాణికుల రద్దీని అదుపు చేయడానికి, సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ తీర రైల్వే) కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ నుంచి పలాస మధ్య దువ్వాడ మీదుగా ప్రత్యేక జన సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబరు 3, 4 తేదీలలో (శని, ఆదివారాల్లో) రెండు వైపులా చెరో రెండు సర్వీసుల చొప్పున ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం మార్గమధ్యలో నూజివీడు , ఏలూరు , తాడేపల్లిగూడెం, రాజమండ్రి , అనపర్తి , సామర్లకోట, అన్నవరం , తుని, ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చిపురుపల్లి, పొందురు, శ్రీకాకుళం రోడ్, కోటబొమ్మాళి, నౌపడ స్టేషన్లలో ఆగుతాయి.

సాధారణ ప్రయాణిక...