భారతదేశం, జూన్ 3 -- ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జూన్ 6వ తేదీ వరకు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

తూర్పు మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఈశాన్య తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి,...