భారతదేశం, సెప్టెంబర్ 30 -- పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల నిర్మాణ అనుమతులపై భారీ సడలింపు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మున్సిపాలిటీ, కార్పొరేషన్, గ్రామాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు రూపాయికే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు 50 చదరపు గజల్లోపు ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి ఫీజుతో పర్మిషన్ నిర్ణయిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీనితో 50 చదరపు గజాలలోపే నిర్మాణాలకు బిల్డింగ్ ఫీజు కేవలం ఒక రూపాయి మాత్రమే ఉంటుంది. మిగిలిన సంబంధిత ఛార్జీలు తీసుకోరని స్పష్టంగా ప్రకటించారు. నగర, పట్టణాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.

రాష్ట్రంలో ఏటా సుమారు 35 వేలకుపైగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు జారీ అవుతున్నాయి. వీటిలో 25 నుంచి 30% ఇళ్లు పేద, మధ్య తరగతి కుటుంబాలవే. ఇప్పటివరకు ఈ ఇళ్లకు అనుమతులు తీసుకోవడానికి రూ.3 వేలు నుంచి రూ.4 వేల ...