Andhrapradesh, ఆగస్టు 12 -- ఈ నెల 15వ తేదీ నుంచి మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా 700 ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌ల‌ను పౌరుల‌కు అందించనున్నారు. ఈ మేరకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రకటన చేశారు. సోమ‌వారం స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వర్నెస్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కేంద్రాన్ని సీఎం సందర్శించి. స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో సేవలు పొంద‌డంలో పౌరుల‌కు ఎలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా సంబంధిత శాఖ‌ల‌న్నీ చూసుకునేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ప్ర‌జ‌లు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా పౌరులు వాట్సాప్ ద్వారానే సేవ‌లు పొంద‌వ‌చ్చ‌ని దీనిపై పౌరుల‌కు మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ వినియోగించుకునే వారి శాతం మ‌రింత పెర‌గాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీజీఎస్ ల...