భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పీజీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ లో భాగంగా 11,401 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా. 9,892 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు.

ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ లో భాగంగా సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ఈ నెల 27 లోపు ఆయా కళాశాల్లో రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఇక మిగిలిన సీట్లకు అక్టోబరు మొదటి వారంలో రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీసెట్ - 2025కు మొత్తం 21,995 మంది హాజరయ్యారు. వీరిలో 19,488 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 88.6 శాతం ఉత్తీర్ణత...